భైంసా పట్టణంలో సర్పంచ్ ల సన్మాన సభ

* ముఖ్య అతిథులుగా ఈటెల రాజేందర్, ఏలేటి మహేశ్వర్ రెడ్డి

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలివెలుగుల చక్రపాణి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూటకో మాట మాట్లాడుతూ పిట్టల దొరల వ్యవహారిస్తున్నారని మల్కాజిగిరి ఎం. పి. మాజీ మంత్రి బిజెపి నేత ఈటెల రాజేందర్, బిజె ఎల్పి శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. శుక్రవారం భైంసా లోని ఎస్ ఎస్. జిన్నింగ్ ఫ్యాక్టరీ లో బిజెపి సర్పంచ్ లు, ఉప సర్పంచ్ లు, వార్డ్ మెంబర్ల సన్మాన కార్యక్రమానికి వారు ముఖ్య అతిథులు గా హాజరై మాట్లాడారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా గారడీ మాటలతో కాలం వెల్లడిస్తుం దన్నారు. పెన్షన్ పెంపు, నిరుద్యోగ భృతి ఏమయ్యాయని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలు కెసిఆర్ ను బొంద పెట్టిన విధంగా, కాంగ్రెస్ సర్కార్ కు గుణ పాఠం చెబుతారని అన్నారు. ఇతర రాష్టాల్లో బిజెపి ఒక్క సారి అధికారం లోకి వస్తే 25 సంవత్సరాల పాటు పాలిస్తున్న రాష్టాలు ఉన్నాయన్నారు. ముధోల్ విజయం స్ఫూర్తి తో రానున్న అన్ని ఎన్నికల్లో విజయం సాధిస్తామన్నారు. మైనారిటీ ఓట్లను అడ్డం పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ఎన్నకలకు వెళ్తుందే తప్ప చేసింది ఏమి లేదన్నారు. అభివృద్ధి పై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మౌనం, సహనం, ఓపిక ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ తత్త్వమని అందుకే ముధోల్ నియోజకవర్గం లో 103 స్థానాలు గెలిచారంటే అది ఏక పక్ష తీర్పే నన్నారు. 15 ఫైనాన్స్ నిధుల కోసమే రేవంత్ రెడ్డి ఇష్టం లేకున్నా సర్పంచ్ ఎన్నికలకు వెళ్లారన్నారు. 20 రోజులు గడుస్తున్న సర్పంచ్ లకు చెక్ పవర్ ఎందుకు ఇవ్వడం లేదన్నారు. గ్రామ పంచాయతీలకు వచ్చే నిధులన్నీ కేంద్రానివని,గ్రామాల అభివృద్ధి వాటి వల్లే జరుగుతుందన్నారు. సొమ్ము కేంద్రానిది సోకు రాష్ట్రనిధి అన్నారు. రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్టానికి ముఖ్యమంత్రి అని బిజెపి సర్పంచ్ ల పట్ల వివక్ష చూపితే కర్రు కాల్చి వాత పెడతామని హెచ్చరించారు. బీజేఎల్పి ఉప నేత పాయల శంకర్, ఎంపి నగేష్, ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ జిల్లా అధ్యక్షులు రితిష్ రాథోడ్ కాంగ్రెస్ ప్రభుత్వం పై తీవ్ర స్థాయి లో మండిపడ్డారు. సర్పంచ్ లకు సన్మానం కార్యక్రమం లో ముధోల్ నియోజకవర్గానికి చెందిన సర్పంచ్ లను, ఉప సర్పంచ్ లను వార్డ్ మెంబెర్ లను ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ శాలువాతో సత్కరించి మెమంటో లు ప్రధానము చేశారు.. కార్యక్రమం ప్రారంభం కంటే ముందు బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గోపాల్ సర్దా మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ మౌనం పాటించారు. సన్మాన కార్యక్రమానికి భారీగా జనం సర్పంచ్ ల సన్మాన కార్యక్రమానికి పెద్ద మొత్తం లో జనం రావడం తో సభ సక్సెస్ అయింది. వేలాది మంది తో ఎస్. ఎస్. జిన్నింగ్ ఫ్యాక్టరీ నిండి పోయింది. కార్యక్రమం లో సీనియర్ నాయకులు, నాయకులు, పార్టీ బాధ్యులు, కార్యకర్తలు మాజీ ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *