పయనించే సూర్యుడు జనవరి 10 కరీంనగర్ న్యూస్: రామడుగు మండలం వెధిర గ్రామ పరిధిలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆకస్మికంగా సందర్శించారు విద్యాలయంలోని వంటగది స్టోర్ రూమ్, తరగతి గదులను పరిశీలించారు స్టోర్స్ నిల్వలకు సంబంధించిన పలు రిజిస్టర్ లను తనిఖీ చేశారు విద్యార్థులకు సిద్ధం చేసిన మెనూ అడిగి తెలుసుకున్నారు నాణ్యమైన ఆహారాన్ని అందించాలని ప్రభుత్వం ఇచ్చిన మెనూ ప్రకారం భోజనం ఇతర ఆహార పదార్థాలు అందించాలని సిబ్బందిని ఆదేశించారు పాఠశాల పరిసరాలు వంటగది పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు పరిశుభ్రమైన తాగునీరు అందించాలని సూచించారు అపరిశుభ్ర వాతావరణంలో విద్యాలయం నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు కేజీబీవీ లో ఏర్పాటుచేసిన ఫిర్యాదుల పెట్టెను పరిశీలించారు ఫిర్యాదుల పెట్టెను పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు మహిళా కానిస్టేబుల్ ఆధ్వర్యంలో ఫిర్యాదుల పరిశీలన ఉంటుందని ఏవైనా ఇబ్బందులు ఎదురైతే ధైర్యంగా ఫిర్యాదు చేయాలని విద్యార్థులకు సూచించారు అనంతరం తరగతి గదిలో విద్యార్థులతో మాట్లాడారు సిలబస్ బోధించిన పాఠ్యాంశాలు తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు పదో తరగతి విద్యార్థులు బోర్డు పరీక్షలకు సంసిద్ధంగా కావాలని సూచించారు కలెక్టర్ వెంట ప్రత్యేక అధికారి అనిల్ ప్రకాష్, జిల్లా బాలికల అభివృద్ధి అధికారి కృపారాణి ఉన్నారు