పయనించే సూర్యుడు జనవరి 10 ఎన్ రజినీకాంత్:- ప్రజల సౌకర్యార్థం మండల కేంద్రమైన భీమదేవరపల్లిలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆధార్ నమోదు కేంద్రాన్ని ఎంపీడీఓ వీరేశం శుక్రవారం ప్రారంభించారు. ఇకపై కొత్త ఆధార్ కార్డుల నమోదు, వేలిముద్రలు, ఫోన్ నెంబర్ అప్‌డేట్, చిరునామా మార్పుల కోసం ప్రజలు దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇక్కడే చేసుకోవచ్చని తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమం లో డిప్యూటీ తహసిల్దార్ సూర్య, భీమదేవరపల్లి గ్రామ సర్పంచ్ మాచర్ల కుమార్ స్వామి పాల్గొన్నారు..