ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిలో ఒకేరోజు 23 డెలివరీలు

* స్త్రీ వైద్య నిపుణులను, మిడ్ వైఫరీ నర్సింగ్. వెటర్నరీ సిబ్బందిని అభినందించిన అధికారులు * డిప్యూటీ మెడికల్ సూపర్డెంట్ డాక్టర్ వి.శేఖర్ .

పయనించే సూర్యుడు జనవరి 10 నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి రిపోర్టర్ శ్రావణ్ కుమార్ నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిలో మెటర్నిటీ విభాగం స్త్రీ వైద్య నిపుణులు, వైద్యులు,మీడ్ వైఫరీలు, నర్సింగ్ అధికారులు సంయుక్తంగా గురువారం నాడు 24 గంటల పరిధిలో ఒకేరోజు 23 డెలివరీలు జిల్లా లోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన గర్భవతులకు డెలివరీ సేవలు సుఖప్రసవాలు నిర్వహించినట్లు ప్రభుత్వ సాధారణ ఆసుపత్రి డిప్యూటీ మెడికల్ సూపర్డెంట్ డాక్టర్ వి.శేఖర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్త్రీ వైద్య నిపుణులు ప్రొఫెసర్లు డాక్టర్ నీలిమా,డాక్టర్ సుప్రియ,అసోసియేట్ ప్రొఫెసర్లు డాక్టర్ సౌమ్య డాక్టర్ కవిత వైద్యుల బృందం ప్రత్యేకంగా చర్యలు తీసుకొని ప్రతిరోజు నాగర్ కర్నూల్ ప్రభుత్వ సాధారణ ఆసుపత్రికి వస్తున్న గర్భవతులకు గర్భిణీ పరీక్షలు మరియు ప్రసవానికి వచ్చిన గర్భవతులకు సాధారణంగా మరియు సిజేరియన్ డెలివరీలు 24 గంటల పాటు నిర్వహిస్తున్నారని ఆయన తెలిపారు. ఈ నూతన సంవత్సరంలో గురువారం రోజు 24 గంటల సమయంలో 23 డెలివరీలు వైద్య బృందం సహాయంతో నిర్వహించినట్లు ఆయన తెలిపారు. ఇందులో 12 సాధారణ ప్రసవాలు 11 అత్యవసర ఎంపిక చేసిన సిజరిన్ డెలివరీలు వైద్యులు, మెడ్ వైఫరీ నర్సింగ్ అధికారులు చేశారని ఆయన తెలిపారు వీరి కృషికి అభినందనీయమని పలువురు ప్రశంసించారు విధి నిర్వహణలో ఉన్న స్త్రీ వైద్య నిపుణులు డాక్టర్ అమ్రిన్ షరీఫ్, డాక్టర్ గంటి శృతి, డాక్టర్ సనా ఫాతిమా, డాక్టర్ కవిత లను ప్రత్యేకంగా అభినందించారు. ఆస్పత్రిలో డెలివరీలు సాధారణంగా చేయుటకు ప్రత్యేక శిక్షణ పొందిన 9 మంది మిడ్ వైఫరీ నర్సింగ్ అధికారులు ఉన్నారని ఆయన తెలిపారు. అంతేకాకుండా అత్యవసర సమయంలో ఫిట్స్,బిపి, షుగర్, వచ్చిన గర్భిణీలను గుర్తించి ప్రత్యేకంగా ఆరోగ్య సేవలు అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. మొదటి,రెండు ప్రసవాలు సిజేరియన్ అయినవారికి ప్రత్యేకంగా ఎంపిక చేసి సిజేరియన్ డెలివరీలు ఆసుపత్రిలో చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి నెల 400పై గాడెలివరీ లు అవుతున్నట్లు తెలిపారు. ప్రసవం అనంతరం బాలింతలను 102 అంబులెన్స్ లో ఇంటికి పంపిస్తున్నట్లు తెలిపారు. నవజాత శిశువులకు ప్రత్యేకంగా చిన్న పిల్లల వైద్య నిపుణులు పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ దివ్య, డాక్టర్ శిరీష,డాక్టర్ శ్రావణి, డాక్టర్ నికిత,డాక్టర్ సాత్విక, డాక్టర్ మౌనిక ,డాక్టర్ కావ్య అనస్థీయా వైద్యులు, నర్సింగ్ అధికారులు సువేద ,ప్రసన్న, రూప,పద్మ, చంద్రకళ, సంగీత, పద్మావతి,రేణుక,జరీనా, శివలీల,రేవతి,గౌతమి,కమల తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *