పయనించే సూర్యుడు న్యూస్ జనవరి 11 మంథని నియోజకవర్గ ఇంచార్జి రమేష్, మంథని పట్టణంలోని రేణుక ఎల్లమ్మ దేవాలయం లో మంథని డివిజన్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు మోత్కూరు శ్రీనివాస్, ఆదేశాల మేరకు శనివారం ముందస్తు సంక్రాంతి పండుగను పురస్కరించుకొని,ముగ్గుల పోటీలు నిర్వహించారు. సంక్రాంతి ముగ్గుల పోటీలో మొదటి బహుమతి విజేత మొలుగూరి కోమల, రెండవ బహుమతి విజేత మాచిడి మంజుల, మూడో బహుమతి విజేత పూదరి స్వాతి,లకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మంథని డివిజన్ ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి, విజయ క్రాంతి, దినపత్రిక డిస్టిక్ స్టాపర్ కొడారీ మల్లేష్ యాదవ్, మొదటి విజేతకు బహుమతి అందజేశారు. ఈ సందర్భంగా కొడారీ మల్లేష్ యాదవ్, మాట్లాడు తూ. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న ముగ్గుల పోటీల్లో భాగంగా మంథని రేణుక ఎల్లమ్మ ఆలయంలో ముగ్గుల పోటీలు నిర్వహించిన ఏ గోలపు సంతోష్ గౌడ్, మంథని లక్ష్మణ్,లను ముందుగా అభినందించారు. ముగ్గుల పోటీలో పాల్గొన్న మహిళల కు ముందస్తు సంక్రాంతి పండగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొని మహిళలు చాలా అందంగా రకరకాల ముగ్గులు వేశారని అవి ఎంతగానో ఆకట్టుకు న్నాయని అన్నారు. ఈ నేపథ్యంలోనే డివిజన్ ప్రెస్ క్లబ్ పాత్రికేయులు వేగోలపు సంతోష్ గౌడ్, (సూర్య దిశ) దినపత్రిక పాత్రికేయులు మంథని లక్ష్మణ్, (ప్రత్యక్ష సాక్షి) దినపత్రిక పాత్రికేయులు పాల్గొని ద్వితీయ, తృతీయ,విజేతలకు బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో మంథని గౌడ,సంఘం సభ్యులు డివిజన్ ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి కొడారీ మల్లేష్ యాదవ్ ను శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం మంథని గౌడ సంఘం సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి స్వీట్స్ పంపిణీ చేసి విజేతలకు శుభ అభినం దనలు తెలియజేసారు.