
పయనించే సూర్యుడు న్యూస్ : జనవరి 11, తల్లాడ రిపోర్టర్ తల్లాడ లయన్స్ క్లబ్ అధ్యక్షులు కోడూరు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఈరోజు తేధి 10-01-2026 శనివారం ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఏపీ సింగ్ జన్మదినోత్సవం సందర్భంగా వారం రోజులు అన్నదాన కార్యక్రమం చేయుటలో భాగంగా ఈరోజు మల్లారం గ్రామపంచాయతీ కార్మికులకు మధ్యాహ్నం అన్న ప్రసాదం వితరణ. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు, మరియు డిస్టిక్ జాయింట్ కోఆర్డినేటర్ తల్లాడ గ్రామపంచాయతీ ఉపసర్పంచ్ కర్నాటి లక్ష్మారెడ్డిరెడ్డి, జెడ్ సి బెల్లంకొండ ఆంజనేయులు, మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఏపీ సింగ్ జన్మదినోత్సవ సందర్భంగా మల్లారం గ్రామపంచాయతీ కార్మికులకు మధ్యాహ్నం అన్న ప్రసాదాన్ని సహాయం చేసిన డిసి బెల్లంకొండ ఆంజనేయులుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అన్నారు. ఈ కార్యక్రమంలో డిసి వేమిరెడ్డి వెంకటనారాయణ రెడ్డి, మాజీ సెక్రటరీ కటికి వెంకటేశ్వరరావు, అయినాల రామలింగేశ్వరరావు, వేమిరెడ్డి చిన్న కృష్ణారెడ్డి, తోట మురళి, తోట శ్రీనివాసరావు, జి బాలకృష్ణ, మల్లారం గ్రామ సర్పంచ్ కటికి కిరణ్, మాజీ సర్పంచ్ మేడి సీతారాములు, మల్లారం గ్రామపంచాయతీ కార్మికులు, గ్రామ ప్రజలు మొదలగువారు పాల్గొన్నారు.
