పయనించే సూర్యుడు జనవరి 11 హుజురాబాద్ రూరల్ రిపోర్టర్ బండ శివానంద రెడ్డి తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న 2వ సీఎం కప్ టోర్నమెంట్ సన్నాహక కార్యక్రమంలో భాగంగా రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న టార్చ్ ర్యాలీ ఈ రోజు జమ్మికుంట మండలానికి చేరుకుంది. జమ్మికుంట పట్టణంలో టార్చ్ ర్యాలీ నిర్వహించారు. కరీంనగర్ జిల్లా పేట సంఘం అధ్యక్షులు బాబు శ్రీనివాస్, పేట సంఘం సెక్రటరీ ఆడేపు శ్రీనివాస్ టార్చ్ ర్యాలీ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్ జి ఎఫ్ సెక్రటరీ శ్రీలత మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం, రూరల్ టు గ్లోబల్, అనే నిదానంతో ప్రతి గ్రామం నుంచి క్రీడాకారులను తయారు చేసే విధంగా కార్యక్రమం రూపొందించారని, ఇందులో విద్యార్థులు, యువత భాగం అవ్వాలని, సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని, మంచి దేహదారుఢ్యాన్ని రూపొందించుకోవాలని, క్రీడల్లో రాణించి మన గ్రామానికి, మండలానికి, జిల్లాకి, తెలంగాణ రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో డివైఎస్ఓ శ్రీనివాస్ గౌడ్,ఎస్ జి ఎఫ్ సెక్రటరీ శ్రీలత ,పిటి భగత్, తదితర వ్యాయామా ఉపాధ్యాయులు పాల్గొన్నారు.