పయనించే సూర్యుడు 11-01-2026 జబ్బర్ కామారెడ్డి కాంసెన్సీ ఇన్చార్జి. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సూపరిడెండ్ ఆఫ్ పోలీస్ కార్యాలయంలో కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ (ఐవిఎఫ్),ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి సందర్భంగా తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం సోమవారం (12-01-2026) రోజున లక్ష్మీ దేవి గార్డెన్స్ లో ఉదయం 09 గంటల నుండి నిర్వహిస్తున్న మెగా రక్తదాన శిబిరానికి సంబంధించిన పోస్టర్లను సూపరిండెండ్ ఆఫ్ పోలీస్ రాజేష్ చంద్ర ఐపిఎస్ ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రాజేశ్ చంద్ర ఐపిఎస్ మాట్లాడుతూ కామారెడ్డి జిల్లా యువత తల సేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం నిర్వహిస్తున్న ఈ మెగా రక్తదాన శిబిరంలో పాల్గొని ఎక్కువ సంఖ్యలో రక్తదానం చేయాలని పిలుపును ఇచ్చారు. 2023 నుండి 2025 వరకు ఐదు వేల యూనిట్ల రక్తాన్ని సేకరించడం జరిగిందని,తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మెగా రక్తదాన శిబిరాలను నిర్వహిస్తున్నామని ఎస్పి రాజేశ్ చంద్ర కి ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్,రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు తెలియజేశారు.ఈ సందర్భంగా తల సేమియా పురస్కారం 2026 ను ఎస్పీ కీ అందజేయడం జరిగింది. చిన్నారుల కోసం మెగా రక్తదాన శిబిరాలు నిర్వహిస్తూ దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్,ఆసియా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సాధించిన కామారెడ్డి రక్తదాతల సమూహ సభ్యులు డాక్టర్ బాలు,జమీల్,డాక్టర్ అనీల్, డాక్టర్ వేదప్రకాష్,ఎర్రం చంద్రశేఖర్, గంప ప్రసాద్,పర్ష వెంకటరమణ లను ప్రత్యేకంగా అభినందించడం జరిగింది