పయనించే సూర్యుడు న్యూస్ 11 మెదక్ జిల్లా చేగుంట మండల ప్రతినిధి కాశబోయిన మహేష్ చేగుంట మండల కేంద్రంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో మెదక్ జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షులు మ్యాకల జయరాములు ఆధ్వర్యంలో మరియు తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం అధ్యక్షులు వల్లకాటి రాజకుమార్ నేతృత్వంలో మొదటగా మార్కండేయ స్వామికి జ్యోతి ప్రజ్వలన చేశారు అనంతరం పద్మశాలి సంఘం క్యాలెండర్ ఆవిష్కరించారు.మెదక్ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలలో గెలుపొందిన సర్పంచులు ఉప సర్పంచులు వార్డు మెంబర్లకు ఘనంగా శాలువాతో సత్కరించారు మరియు మండల అధ్యక్షులకు ఘనంగా జయరాములు ను సత్కరించారు వారు మాట్లాడుతూ మెదక్ జిల్లా అంతా చేగుంట లోనే ఉన్నట్టు కనిపిస్తున్నదని వారు అన్నారు పద్మశాలీలందరూ ఐక్యంగా ఉండాలని పద్మశాలీలను స్థానిక ఎన్నికలలో గెలిపించాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గం మెదక్ జిల్లా నలుమూలల నుండి వచ్చిన అందరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు