పయనించేసూర్యుడు న్యూస్, జనవరి11ఆదోని డివిజన్ ఇంచార్జ్ గుమ్మల బాలస్వామి) ప్రజా భద్రత, శాంతి పరిరక్షణలో అంకితభావంతో, క్రమశిక్షణతో, నిబద్ధతతో సేవలందిస్తూ పెద్దకడబూరు పోలీస్ స్టేషన్ రాష్ట్రంలోనే అత్యుత్తమ పోలీస్ స్టేషన్‌గా ఎంపికై, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రకటించిన 2026అత్యుత్తమ పోలీస్ స్టేషన్, అవార్డును డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఐపీఎస్, చేతుల మీదుగా అందుకోవడం గర్వకారణం. ఈ ఘనతను. డీజీపీ కర్నూలు ఇంచార్జ్ ఎస్పీ విక్రాంత్ పటేల్ ఐపీఎస్, ఎమ్మిగనూరు డీఎస్పీ, భార్గవి, కోసిగి సీఐ,బి.ఏ.మంజునాథ్, పెద్దకడబూరు ఎస్ఐ నిరంజన్ రెడ్డి, అందుకోవడం అభినందనీయం. ఈ అపూర్వ విజయానికి కారణమైన, ఎస్ఐ. నిరంజన్ రెడ్డి కి పోలీస్. సిబ్బందికి. హృదయపూర్వక శుభాకాంక్షలు & అభినందనలు. మీ సేవలు ప్రజలకు ఎల్లప్పుడూ ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షిస్తున్నాము.
