వాగ్దేవి డిగ్రీ కళాశల లో ఘనంగా ముందస్తు సంక్రాంతి సంబరాలు.

పయనించే సూర్యుడు జనవరి 11 హుజురాబాద్ రూరల్ రిపోర్టర్ బండ శివానంద రెడ్డి స్థానిక హుజురాబాద్ విద్యానగర్ లో గల వాగ్దేవి డిగ్రీ కాలేజీ లో ముందస్తు సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. ఈ ఉత్సవాలో భాగంగా విద్యార్థులు కళాశాలను మామిడి తోరణాలతో, అరటి అకులతో అలంకరించి రంగు రంగుల సంక్రాంతి ముగ్గులు వేయడం జరిగింది. అలాగే కళాశాల ఆవరణంలో భోగి మంటలు వేసి నృత్యాలతో అలారంచడం జరిగింది. అనంతరం కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమలు ఏర్పాటు చేశారు అనంతరం కళాశాల కరెస్పాండంట్ ఏనుగు మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ సంక్రాంతి పండగ ప్రాముఖ్యత, పండగ జరుపకునే విధానం గురించి వివరించారు అలాగే కళాశాల అడ్వైసర్ పోరెడ్డి శాంతన్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులందరు మన తెలుగు సంస్కృతి సంప్రదాయాలను కాపాడుతూ, సమాజంలో ఉన్నత వ్వక్తులు గా ఉండాలని అలాగే తల్లిదండ్రుల ఆశాలను నిలబెట్టాలని కోరుకున్నారు అనంతరం ముగ్గుల పోటీలో గెలుపొందిన విద్యార్థులకు శాంతన్ రెడ్డి చేతులపై బహుమతులు ఇవ్వడం జరింది.ఈ కార్యక్రమం లో విద్యార్ధివిద్యార్థులతో పాటు కళాశాల ప్రిన్సిపాల్ ప్రవీణ్ రెడ్డి,అధ్యాపకులు కొలిపాక రమేష్, భద్రయ్య, సంపత్, శ్రీనివాస్, వెంకటేష్, నవీన్, రమేష్, స్వప్న, ప్రియాంక తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *