గీత పాఠశాలలో అట్టహాసంగా ముందస్తు సంక్రాంతి వేడుకలు

పయనించే సూర్యుడు జనవరి 11 పాపన్నపేట మండల రిపోర్టర్ దుర్గాప్రసాద్ స్థానిక మంబోజిపల్లి గీతా పాఠశాలలో ముందస్తు సంక్రాంతి సంబరాలు అట్టహాసంగా నిర్వహించారు. పరికిణీలు వేసుకున్న సీతాకోకచిలుకల్లా విద్యార్థినులు సాంప్రదాయాలు దుస్తుల్లో వచ్చి భారతదేశ సాంప్రదాయాన్ని మన సంస్కృతిని కన్నుల ముందట నిలిపారు. గ్రూపులుగా విడిపోయి విశాలమైన మైదానంలో వారు వేసిన రంగవల్లులు వినీల ఆకాశంలో ఇంద్రధనస్సు వలె చూపర్ల నయనాలను మైమరిపించాయి. విద్యార్థులు ఉల్లాసంగా గాలిపటాలు ఎగురవేసి వాతావరణాన్ని ఆ. ఈ సందర్భంగా పాఠశాల సెక్రటరీ రామాంజనేయులు మాట్లాడుతూ అన్ని పండుగలు తిథి ఆధారంగా జరుపుకుంటే ఈ మూడు రోజుల పండుగ మాత్రమే సూర్యుని ఆగమనం ప్రకారం జరుపుకుంటామని అనగా సూర్య భగవానుడు దక్షిణాన పూర్తి చేసుకొని మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు ఈ పండుగ జరుపుకుంటామని తెలిపారు. పాఠశాల ప్రిన్సిపల్ శ్రీ మాధవి రామాంజనేయులు మాట్లాడుతూ దక్షిణ భారతదేశంలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తమిళనాడుల్లో ఈ పండుగకు ముందు రైతులు పండించిన ధాన్యం ఇళ్లకు చేరుకొని రైతులు సంతోషంగా ఉంటారని మనందరికీ అన్నం పెట్టే రైతు ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలని తద్వారా దేశం సుభిక్షంగా వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ అందరికీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఇన్చార్జిలు కోఆర్డినేటర్లు ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు బోధనేతర సిబ్బంది మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *