ఏడుపాయల్లో ఘనంగా మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు జన్మదిన వేడుకలు

* భారీ కేక్ కట్ చేసిన నాయకులు

పయనించే సూర్యుడు జనవరి 11. పాపన్నపేట మండల రిపోర్టు దుర్గాప్రసాద్ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు, మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు జన్మదిన వేడుకలు పాపన్నపేట మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శ్రీ ఏడుపాయల వనదుర్గాభవాని మాత సన్నిధిలో శనివారం ఘనంగా నిర్వహించారు. పాపన్నపేట మండల కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు పేరుమీద వనదుర్గా మాతకు ప్రత్యేక పూజలు, కుంకుమార్చనలు చేసి హన్మంతరావు నిండు నూరేళ్లు, ఆయురారోగ్యాలతో జీవించాలని, సుఖ సంతోషాలను ప్రసాదించాలని, మరెన్నో ఉన్నతమైన పదవులు వచ్చేలా దీవించాలని అమ్మవారిని మొక్కుకొని ప్రార్థించారు. అనంతరం ఆలయ రాజగోపురం ప్రాంగణంలో భారీ కేక్ కట్ చేసి హన్మంతరావు కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పి ప్రశాంత్ రెడ్డి, పి ప్రభాకర్ రెడ్డి, గోవింద్ నాయక్, లింగన్న మల్లప్ప, త్యార్ల రమేష్, ఎన్ జీవన్ రెడ్డి,శెట్టి శ్రీకాంత్, పార్శీ నర్సింలు, భరత్ గౌడ్, మండల పరిధిలోని వివిధ గ్రామాల సర్పంచ్ లు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *