మృతుని కుటుంబానికి హార్దిక సహాయం

* సదా మీ సేవలో అంటున్న నూతన సర్పంచ్ కోడూరు స్వర్ణలత శివకుమార్

పయనించే సూర్యుడు, జనవరి 11, బచ్చన్నపేట మండల ప్రతినిధి: నీల పవన్. మండలంలోని కోన్నే గ్రామానికి చెందిన గునుగంటి భాగ్యలక్ష్మి(38) గురువారం ఉదయం అనారోగ్యంతో మృతిచెందారు. విషయం తెలుసుకొన్న గ్రామ నూతన సర్పంచ్ కోడూరు స్వర్ణలతా శివకుమార్ గౌడ్ వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి మనో ధైర్యం చెప్పి 5000 ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. అధికారం వచ్చినా పేద ప్రజలను మర్చిపోకుండా అక్కున చేర్చుకుంటున్న సర్పంచ్ ని గ్రామ ప్రజలు అభినందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ చల్ల కమలాకర్ మరియు చెవుల నరసయ్య, బాలరాజు, గునుగంటి అశోక్, చెవుల కుమారస్వామి, జవ్వాది నరసింహులు, చల్ల రవి, చల్ల నవీన్, కొర్వి శంకర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *