సీఎంఆర్ఎఫ్ చెక్కులను 54 మందికి రూ.19,61,500/ లబ్ధిదారులకుపంపిణీ చేసిన పి ఏ సి చైర్మన్ గాంధీ

పయనించే సూర్యుడు, జనవరి 11 రంగారెడ్డి జిల్లా ప్రతినిధి (ఎస్ఎంకుమార్/ శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని పలువురు వైద్య చికిత్స నిమిత్తం ముఖ్య మంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకొ నగా 54 మంది లబ్ధిదారులకు (సీఎంఆర్ ఎఫ్) ద్వారా మంజూరైన రూ.19,61,5 00/- పంతొమ్మిది లక్షల అరవై ఒక వె య్యి ఐదు వందల రూపాయల ఆర్థిక సహాయానికి సంబంధించిన సీఎంఆర్ఎ ఫ్ చెక్కులను కార్పొరేటర్లు దొడ్ల వెంకటే ష్ గౌడ్, హమీద్ పటేల్ తో కలిసి బాధిత కుటుంబాలకి అందచేసిన పిఏసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ. ఈ సందర్భంగా పీఏసీ చైర్మన్ గాంధీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి పేద ప్రజలకు గొప్ప వరం అని, ప్రజాక్షేమమే ప్రభుత్వ లక్ష్యంగా తెలం గాణ ప్రభుత్వం కృషి చేస్తుందని, ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి పేదల పక్షపాతి అని పిఎసి చైర్మన్ గాంధీ పునరుద్గా టించారు.అదేవిధంగా ముఖ్యమంత్రి సహాయ నిధి నిరంతరం సేవలను అందిస్తూ ఆపదలో ఉన్నవారికి ఆపన్న హస్తంలా ఆదుకుంటున్నదని, అనారో గ్యంకు గురై ఆర్థిక స్థోమత లేక ఆసుపత్రి లో చికిత్స పొందిన నిరుపేదలకు,అభా గ్యులకు అండగా సీఎం సహాయ నిధి ఆర్థిక భరోసా నిస్తుందని.. పిఎసి చైర్మన్ గాంధీ ఈ సందర్బంగా తెలియచేశారు. పేద మధ్యతరగతి ప్రజలకు ఆసుపత్రి లో బిల్లులు కట్టలేని పరిస్థితిలో ఉన్న వారికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలు స్తూ ఆర్థిక సాయంని అందిస్తుందని దీనిలో భాగంగానే నియోజకవర్గ వ్యాప్తం గా ఇప్పటివరకు ఎన్నో వందలాది కు టుంబాలను సీఎంఆర్ ఎఫ్ ద్వారా ఆదుకున్నామని తెలిపారు. గతంలో ఉన్న బిల్లులకు అనుగుణంగానే ప్రస్తు తం ఆర్థిక సాయం అందిస్తుందని దానిని మరింత పెంచేలా కృషి చేసేందుకు ము ఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి త్వరలో నే కలిసి వినతి పత్రాన్ని అందజేస్తానని, మరింత ఆర్థిక సహాయం పెంచితే పేద ప్రజలకు ఎంతగానో ఉపయోగపడు తుంది అని పిఎసి చైర్మన్ గాంధీ అన్నారు. ఈ సందర్భంగా వైద్య చికిత్సకి సహ కారం అందించిన పీఏసీ చైర్మన్ ఆరెక పూడి గాంధీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేస్తున్నాము అని బాధితుల కుటుంబ సభ్యులు పేర్కొ న్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు సంజీవ రెడ్డి, జిల్లా గణేష్, మారేళ్ల శ్రీనివాస్, చాంద్ పాషా,కావూరి అనిల్, పురెందర్ రెడ్డి, మల్లయ్య, మంజుల, శివ సాగర్, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నా రు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *