​ కొన్నెలో వైభవంగా శివపార్వతుల కళ్యాణం

* పాల్గొన్న ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి

పయనించే సూర్యుడు, జనవరి 11, బచ్చన్నపేట మండల ప్రతినిధి: నీల పవన్. బచ్చన్నపేట మండలంలోని కొన్నె గ్రామంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది.గత ఐదు రోజులుగా మినలాపురం ఉషా-హన్మంతరావు దంపతుల నివాసంలో జరుగుతున్న వేడుకలు శనివారం పార్వతీ పరమేశ్వరుల దివ్య కళ్యాణంతో కన్నుల పండువగా ముగిశాయి. ఈ వేడుకకు జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు పొందారు.​వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య గత ఐదు రోజులుగా గ్రామంలో శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు.చండీ హోమం,రుద్రహోమం మరియు మహా పూర్ణాహుతి వంటి కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో పూర్తి చేశారు. ​ఈ కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించేందుకు కొన్నె గ్రామంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. ​విచ్చేసిన భక్తులందరికీ నిర్వాహకులు భారీ స్థాయిలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.​​ఈ కార్యక్రమంలో సర్పంచ్ కోడూరి స్వర్ణలత శివకుమార్ గౌడ్, బీఆర్ఎస్ నాయకులు ఇర్రి రమణారెడ్డి, చెంద్రారెడ్డి, చల్లా శ్రీనివాస్ రెడ్డి, వేముల స్వప్నసాగర్ గౌడ్ మరియు ఇతర ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *