పయనించే సూర్యుడు జనవరి 11 ఎన్ రజినీకాంత్:- రైతులకు సీడ్ విత్తనాలు అందించే క్రమంలో కంపేనీ నిర్ణయించిన ధర కంటే ఎక్కువ ధరకు అమ్మి సోమ్ము చేసుకున్న బాధ్యులను గుర్తించి ఆ సోమ్ము రైతులకే తక్షణమే తిరిగి ఇవ్వాలని హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం గట్లనర్సింగాపూర్ గ్రామానికి చెందిన రైతులు డిమాండ్ చేశారు. ములుకనూర్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో రైతు మాడుగుల మొగిళి మాట్లాడుతూ సీడ్ కంపేనీ ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేపడుతూ రైతులకు అండగా ఉంటుండగా కొంత మంది ఆర్గనైజర్లు కంపేనీ పేరు తప్పదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. రైతులకు అధిక ధరకు విక్రయించిన అదనపు సోమ్మును రైతులకు తిరిగి ఇచ్చే విధంగా కంపేనీ యాజమాన్యం చర్యలు తీసుకోవలసిందిగా వారు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ప్రకాష్, కాంతరావు, రాజ్కుమార్, పవన్, ప్రభుదాస్ తదితరులు పాల్గోన్నారు..