పయనించే సూర్యుడు జనవరి 11 కరీంనగర్ న్యూస్: కరీంనగర్ జిల్లా గంగాధర మండలం చర్లపల్లి ఆర్ గ్రామ సర్పంచ్ గా ఎన్నికైన అడ్వకేట్ ఎట్టెపు కనకయ్య ను కరీంనగర్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లింగంపల్లి నాగరాజు ప్రధాన కార్యదర్శి కందుల అరుణ్ కుమార్ సీనియర్ జూనియర్ న్యాయవాదుల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. న్యాయవాద వృత్తిలో రాణించి న్యాయవాదుల కుటుంబం నుంచి కనకయ్య గ్రామ సర్పంచ్ గా ఎన్నిక కావడం చాలా సంతోషకరం గా ఉందని భవిష్యత్తులో మరింత ఉన్నత మైన పదవులు చేపట్టాలని బార్ అసోసియేషన్ బాధ్యులు ఆకాంక్షించారు గ్రామస్తులు కనకయ్యకు ఇచ్చిన సర్పంచ్ అవకాశాన్ని నిలబెట్టుకోని ప్రజా సేవలో న్యాయవాదుల అవసరం ఉంటే తమ సహాయ సహకారాలు ఎల్లవేళల ఉంటాయని పలువురు న్యాయవాదులు కనకయ్యకు చెప్పారు ఈ సందర్భంగా సర్పంచ్ అడ్వకేట్ కనకయ్య మాట్లాడుతూ బార్ అసోసియేషన్ బాధ్యులు నాగరాజు అరుణ్ కుమార్ న్యాయవాదులు అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు