పయనించే సూర్యుడు జనవరి 11 నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి రిపోర్టర్ కే శ్రావణ్ కుమార్ సంక్రాంతి పండుగను పురస్కరించుకొని బిజినేపల్లి మండలం పాలెం గ్రామంలో శనివారం లిటిల్ రోజెస్ హై స్కూల్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు ఘనంగా నిర్వహించారు. చదువుతో పాటు సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ విద్యార్థులు రాణించాలనే ఉద్దేశంతో అధ్యాపకుల ప్రోత్సాహంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. పాఠశాల ప్రాంగణంలో విద్యార్థిని–విద్యార్థులు ముగ్గుల పోటీల్లో ఉత్సాహంగా పాల్గొని తమ సృజనాత్మకతను చాటారు. సంక్రాంతి శోభను ప్రతిబింబించే రంగవల్లికలు అందరినీ ఆకట్టుకున్నాయి. అదనంగా సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటపాటలతో విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శించారు. ముగ్గుల పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన చందన, ఐశ్వర్య, నందిని, లావణ్య, ఆరాధ్య, కృష్ణవంశీ, లాస్యశ్రీ, హర్షితలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ రాము, ఇన్‌చార్జి రాంప్రసాద్‌తో పాటు అధ్యాపక బృందం పాల్గొని విద్యార్థులను అభినందించారు.