శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి కళ్యాణం కమనీయం

* స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన * దేవాదయ ధర్మదయ శాఖ సహాయ కమిషనర్ సునీత * ఆలయ ఈవో కిషన్ రావు * ఆలయ చైర్మన్ అశోక్ ముఖర్జీ * భక్తులతో కిటకిటలాడిన కళ్యాణ మండపం

పయనించే సూర్యుడు జనవరి 11 ఎన్ రజినీకాంత్:- భీమదేవరపల్లి మండలంలోని ఉత్తర తెలంగాణలో ప్రసిద్ధిగాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ కొత్తకొండ వీరభద్రస్వామి ఆలయంలో ఈ ఏడాది సంక్రాంతి స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తుల ఆకర్షణగా నిలిచే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ బ్రహ్మోత్సవాలలో భాగంగా దేవస్థానం ఆధ్వర్యంలో స్వామి వారి కళ్యాణ అత్యంత వైభవంగా జరిపించడం జరిగింది.. నూతనంగా ఏర్పాటు చేసిన దేవస్థానం కమాన్ వద్ద త్రిశూల ప్రతిష్ఠ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేద మంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేక పూజలు, హోమాలు త్రిశూలాన్ని ప్రతిష్ఠించారు. త్రిశూల ప్రతిష్ఠతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభతో కళకళలాడింది. ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై, శ్రీ వీరభద్రస్వామి సమేత భద్రకాళి దేవిని దర్శించుకొని ఆశీర్వాదాలు పొందారు. దేవస్థానం కమాన్ వద్ద త్రిశూల ప్రతిష్ఠ ఆలయానికి మరింత వైభవాన్ని తీసుకువచ్చిందని, సంక్రాంతి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ కార్యక్రమం భక్తుల్లో భక్తి భావాన్ని పెంపొందించిందని ఆలయ నిర్వాహకులు తెలిపారు.. దేవాదాయ ధర్మాదాయ శాఖ సహాయ కమిషనర్ రామల సునీత, ఆలయ ఈవో కిషన్ రావు, దేవాలయ చైర్మన్ అశోక్ ముఖర్జీ, స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.. ఈ కార్యక్రమంలో కుడా, డిసిసి చైర్మన్ వెంకట్రాంరెడ్డి, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జన్నపురెడ్డి సురేందర్ రెడ్డి, భీమదేవరపల్లి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చిట్టెంపల్లి ఐలయ్య, మాజీ అధ్యక్షుడు ఉసకోల ప్రకాష్, తదితరులు పాల్గొన్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *