పతంగులు ఎగిరేసేటప్పుడు పలు జాగ్రత్తలు చెప్పిన విద్యుత్ అధికారులు

పయనించే సూర్యుడు జనవరి 12 (జనగామ ప్రతినిధి కమ్మగాని నాగన్న)కరెంట్ వైర్లు, ట్రాన్స్ ఫార్మర్ లకు సమీపంలో పతంగులు ఎగురవేయొద్దని జనగామ టీజీఎన్ డి సి ఎల్ ఒక ప్రకటనలో యువకులకు పలు సూచనలు చేసింది పతంగులు ఎగరవేసేటప్పుడు పాటించాల్సిన జాగ్రత్తల బహిరంగ ప్రదేశాలు, మైదానాల్లో మాత్రమే పతంగులు ఎగరవేయాలి. విద్యుత్ లైన్ల వద్ద, ట్రాన్స్‌ఫార్మర్లు, సబ్ స్టేషన్ల వద్ద కైట్స్‌ ఎగరవేయడం ప్రమాదకరమని తెలిపింది కాటన్ మాంజాలను మాత్రమే, గ్లాస్ కోటింగ్ లేనివి మాత్రమే వాడాలి. నైలాన్, సింథటిక్ మాంజాలను వాడకూడదు. మెటాలిక్ మాంజాలకు కరెంట్ పాస్ అవుతుంది. అవి విద్యుత్ లైన్లపై పడితే కరెంట్ షాక్ కొట్టే ప్రమాదం ఉంటుంది. పొడి వాతావరణంలో మాత్రమే పతంగులు ఎగరవేయాలి. తేమ వాతావరణంలో విద్యుత్ ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువ పతంగులు, మాంజాలు విద్యుత్ లైన్లపై పడ్డప్పుడు వాటిని వదిలేయాలి అలాకాకుండా వాటిని లాగితే కరెంట్ తీగలు ఒకదానికొకటి తగిలి ప్రమాదం జరగొచ్చు బాల్కనీ, గోడల మీద నుంచి పతంగులు ఎగరవేయరాదు కింద పడిపోయే ప్రమాదం ఉంటుంది పతంగులు ఎగరవేసేటప్పుడు తప్పకుండా పేరెంట్స్ తమ తమ పిల్లలను గమనిస్తూ ఉంటే మంచిదని ఆ ప్రకటనలో తెలిపారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *