పెఱిక కుల సంఘం మంథని మండల అధ్యక్షునికి ఘన సన్మానం

* ఐటీ మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్ బాబు చేతుల మీదుగా అభినందన

పయనించే సూర్యుడు న్యూస్ జనవరి 12 పెఱిక కుల సంఘం మంథని మండల అధ్యక్షుడిగా తమిశెట్టి రమేష్ ఎన్నికైన సందర్భంగా, ఆయనకు ఐటీ మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్ బాబు శాలువాతో ఘనంగా సన్మానం నిర్వహించారు. ఈ కార్యక్రమం మంథని నియోజకవర్గం ఇంచార్జి రమేష్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ, సమాజ అభివృద్ధిలో కుల సంఘాల పాత్ర ఎంతో కీలకమని, ఐక్యతతో ముందుకు సాగితే అన్ని వర్గాలకు సముచిత న్యాయం జరుగుతుందని అన్నారు. పెఱిక కుల సంఘం ద్వారా సామాజిక, ఆర్థిక, విద్యా రంగాల్లో అభివృద్ధి సాధించేందుకు కృషి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో పెఱిక కుల సంఘం నాయకులు మంథని డివిజన్ పరిధిలో పెఱిక కులానికి ప్రత్యేక కమ్యూనిటీ హాల్ మంథని పట్టణంలో నిర్మించాలని మంత్రిని కోరారు. ఈ అభ్యర్థనపై మంత్రి సానుకూలంగా స్పందిస్తూ, సంబంధిత అధికారులతో చర్చించి వీలైనంత త్వరగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అధ్యక్షుడిగా ఎన్నికైన తమిశెట్టి రమేష్ మాట్లాడుతూ, తనపై నమ్మకం ఉంచిన సంఘ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. పెఱిక కుల సంక్షేమం కోసం, ముఖ్యంగా యువత విద్య, ఉపాధి అవకాశాల కల్పన, సామాజిక కార్యక్రమాల నిర్వహణలో ముందుండి పనిచేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెఱిక కుల సంఘం నాయకులు, కార్యకర్తలు, మంథని మండల ప్రజాప్రతినిధులు, పెద్దలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *