
పయనించే సూర్యుడు పెనుగంచిప్రోలు మండలం రిపోర్టర్ ఆరుద్ర రమేష్ ఎన్టీఆర్ జీల్లా జగయ్యపేట నియోజకవర్గం జనవరి 12 పెనుగంచిప్రోలు గ్రామంలో ఉన్న శ్రీ అంబికేశ్వర దేవాలయం పూజలు నిర్వ హించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయం మేరకు, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు.పి.బి.ఎన్ మాధవ్ పిలుపు మేరకు, జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ సూచన మేరకు గుజరాత్ లోని ప్రముఖ జ్యోతిర్లింగం శ్రీ సోమనాథ్ ఆలయం పై మహమ్మద్ గజని దాడి చేసి అపారమైన సంపదను దోచుకుని, దేవాలయాని ధ్వంసం చేసి 1000 సంవత్సరాలు అయినది. మన దేవాలయాలు, సంస్కృతి, సంపదను, మన ధర్మాన్ని కాపాడే బాధ్యత కలిగి ఉండాలని ప్రముఖ దేవాలయాలలో పూజలు నిర్వహించడం జరిగింది. సోమనాద్ దేవాలయం నిర్మాణం జరిగి 75 స వ సంవత్సరాలు పూర్తైన సందర్భంగా ఈ రోజు పెనుగంచిప్రోలు గ్రామంలో ఉన్న శ్రీ అంబికేశ్వర దేవాలయం పూజలు నిర్వ హించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు కంభం నరసింహ స్వామి, జిల్లా నాయకురాలు తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానం ఉత్సవ కమిటీ మెంబర్ కల్లూరి శ్రీవాణి , మాజీ మండల అధ్యక్షులు గణవరపు అప్పారావు, బిజెపి సీనియర్ నాయకులు తునికిపాటి రామాచారి, రాష్ట్ర విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ తూనికిపాటీ.శివ. పార్టీ నాయకులు తునికిపాటి బ్రహ్మం, గింజుపల్లి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.