పయనించే సూర్యుడు న్యూస్ జనవరి 12 యడ్లపాడు మండల ప్రతినిధి వంకాయలపాడు గ్రామానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ప్రస్తుత ఎంపీటీసీ షేక్ ఖాదర్ బాషా ఇటీవల జరిగిన బైక్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న చిలకలూరిపేట నియోజకవర్గ మాజీ మంత్రి విడదల రజిని మానవీయతతో స్పందించి బుధవారం సాయంత్రం ఖాదర్ బాషా నివాసానికి వెళ్లి ఆయనను పరామర్శించారు. ఈ సందర్భంగా ఖాదర్ బాషా ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న మాజీ మంత్రి, మెరుగైన వైద్యం అందేలా అన్ని విధాలా సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు. అలాగే ప్రమాదంలో గాయపడినప్పటికీ ధైర్యంగా ఉండాలని, త్వరగా కోలుకుని మళ్లీ ప్రజాసేవలో ముందుండాలని ఆమె ఆకాంక్షించారు. ఈ పరామర్శ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని ఖాదర్ బాషాకు సంఘీభావం తెలిపారు. పార్టీ ఎల్లప్పుడూ తన నాయకులు, కార్యకర్తల పక్కన ఉంటుందని ఈ సందర్భంగా వారు తెలిపారు.