ఎంసీసీ కార్మికుల సెటిల్మెంట్ ఏది పట్టించుకోని యాజమాన్యం

* 7వ రోజుకు చేరిన రిలే నిరాహార దీక్ష

పయనించే సూర్యుడు జనవరి 12 మంచిర్యాల్ జిల్లా మంచిర్యాల్ మండల్ రిపోర్టర్ (గొడుగు ఆశీర్ విల్సన్) ఎంసీసీ గ్రాట్యుటీ ఇవ్వాలనే సంగతి గంగలో కలిపేశారు ఎరియర్స్ ఎగవేసేందుకే కుటిల పన్నాగాలు ఒక్కో కార్మికుడికి రావల్సినవి 15 లక్షలకు పైమాటే ఆర్థిక లావాదేవీలు పక్కన పెట్టి భూములు కొట్టేయ్యాలనే ఇకమతులు రుణాలు చెల్లించలేదంటూ మధ్యలో దూరిన ఇండియన్ బ్యాంక్ బ్యాంక్ను అడ్డుపెట్టుకొని ఎంసీసీ సాగిస్తున్న దొంగ నాటకాలివి ఎంసీసీ కొత్త కోణాలు.. కొంపలు ముంచే కుతంత్రాలు రెంటికి చెడ్డ రేవడిలా తయారైంది ఎంసీసీ కార్మికుల పరిస్థితి. కంపెనీ నడవక.. సెటిల్మెంట్ పూర్తికాక పూట గడవడానికే పుట్టెడు కష్టాలు పడుతున్నారు కార్మికులు. అటు గ్రాట్యుటీ, ఇటు ఎరియర్స్ రాక అష్టకష్టాలు ఎదుర్కొంటున్న బాధితులు.. గత్యంతరం లేక ఆందోళన బాట పట్టారు. దీనికి తోడు పది, పదిహేనేళ్ల సర్వీసు కూడా తాము కోల్పోయామనే వేదన వారిని వెన్నాడుతోంది. ఫ్యాక్టరీ మూసివేస్తారనే విషయం తెలిసిన నాటి నుండే తమ సెటిల్మెంట్ సంగతి చూడండి మహాప్రభో అని అరిచి గీపెట్టినా.. ఏనాడూ సానుకూలంగా స్పందించని ఎంసీసీ యాజమాన్యం ఆ ఒక్కడే. తాను పట్టిన కుందేటికీ మూడే కాళ్లు అన్న చందంగా వ్యవహరిస్తున్నదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి రెంటికి చెడ్డ రేవడిలా తయా రైంది ఎంసీసీ కార్మికుల పరిస్థితి ఎంసీసీ నడవక.. సెటిల్ మెంట్ పూర్తికాక పూట గడపడానికే స్కేటెడు కష్టాలు పడుతున్నారు కంపెనీ కార్మికులు. అటు గ్రాట్యుటీ, ఇటు ఎరియర్స్ రాక అష్టకష్టాలు ఎదు ర్కొంటున్న బాధితులు.. గత్యంతరం లేక ఆందోళన బాటపట్టాల్సి వచ్చింది. దీనికి తోడు పది, పదిహేను సంవత్సరాల సర్వీసు కూడా తాము కోల్పోయామనే వేదన కూడా వారిని వెన్నాడుతోంది. ఫ్యాక్టరీ మూసి వేస్తారనే విషయం తెలిసిన నాటి నుండే తమ సెటిర్ మెంట్ సంగతి చూడండి మహాప్రభో అని అరిచి గీపెట్టినా.. ఏనా డూ సానుకూలంగా స్పందించని ఎంసీసీ యాజమాన్యం(ఆ ఒక్కడే !) తాను పట్టిన కుందేటికీ మూడే కాళ్లు అన్న చందంగా వ్య వహరిస్తున్నదనే విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. అయితే ప్యాక్టరీ మూసివేసినప్పటి నుండి లెక్కిస్తేనే ఒక్కొక్కరికి పదహేను లక్షలరూ పాయల పైబిబుకు ఎరియర్స్ రావాల్సి ఉన్నా.. యాజమాన్యం నుండి సానుకూల స్పందన లేకపోవడం నిర్వహకుల నిర్లక్ష్య వైఖరి కి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. పూర్తి వివరాల్లోకి వెళితే.. 2019 వ సంవత్సరం నుండే మంచిర్యాల సిమెంట్ కంపెనీ పీక కోసింది ఏకభత్రాధిపత్యమనే యాజమాన్యం. కంపెనీ నష్టాల్లో ఉం దనేకల్లబొల్లి మాటలతో కార్మికులను నయవంచనకు గురిచేయాల నియత్నించింది. అయితే జరుగుతున్న వేదు పరిణామాలను ముం చే పసిగట్టిన కార్మికవర్గం న్యాయ పూరిత చర్చలకే ప్రాధాన్యత ఇచ్చింది. తమలో ఒక్కొక్కరికి పది నుండి పదిహేను.. ఐరవై సంవ త్సరాల సర్వీసు ఉన్న నేపథ్యంలో నష్ట పరిహారం ఇవ్వాలని ప్రతిపాదించారు. గతంలో ఏసీసీగా ఉన్నప్పుడు పని చేసిన కార్మికులు ఉద్యోగులకు ఎలాగైతే సెటిల్ మెంట్ చేశారో అదే తరహాలో తమకు చెల్లింపులు చేయాలని కోరారు. ఇప్పట్లో మూడు, నాలుగు ఆపై సంవత్సరాల సర్వీసు ఉన్న వారికి 1 నుండి ఐవేసి లక్షల రూపా యల చొప్పున పరిహారం ఇవ్వడం జరిగింది. అయితే తమకు అంటే కన్న ఎక్కువ సర్వీస్ ఉన్న దరిమిలా 15 లక్షల వరకు చెల్లించాలని పట్టుబట్టారు. అయినా.. ఎంసీసీ యాజమాన్యం వైఖరిలో మార్పు రాలేదని సమాచారం. తమ ఆవేదనలు, సూచనలు, ప్రతిపాదనలు ఇవేవి పట్టించుకోక పోవడంతో లేబర్ కోర్టులను ఆశ్రయించారు. గ్రాట్యుటీ చెల్లింపుకు ముఖం దాటేశారు..? ఇంకా సర్వీసులో ఉండగానే ఫ్యాక్టరీ మూసివేస్తామని యాజ మాన్యం చెబితే కార్మికులు ఎప్పుడు అడ్డుకోలేదు. అయితే బాధిత కార్మికుల చెల్లింపులకు కూడా ఎంసీసీ ముఖం వాటేయడంతోనేస మస్యలు ఎదురయ్యాయి. అయినప్పటికీ కార్డుకులు. ఏ రోజు కూ డా అభ్యంతరం వ్యక్తం చేయలేదు. తమకు న్యాయపరంగా రావా ల్సిన సొమ్ము ఇస్తే చాలు అన్నట్లు చర్చలకు సిద్ధమేనని ప్రకటించా రు. ఎరియర్స్ తోపాటు గ్రాడ్యుటి కూడా చెల్లించాలని ఫ్యాక్టరీ యా జమాన్యానికి సూచించడం జరిగింది. లక్షా 50 వేల మేరకు గ్రాటిటీ ఇవ్వాలని కార్మికుల కోరినప్పటికీ ఎంసీసీ యాజమాన్యం బందుకు కూడా అంగీకరించలేదు. చర్చలు అర్ధంతరంగా ముగిసిపోయా యి. అప్పటినుండి ఏనాడూ కార్మికుల సంక్షేమాన్ని ఎంసీసీ యాజ మాన్యం పట్టించుకున్న పాపాన పోలేదు. మొత్తానికి ఎరియల్స్, గ్రాట్యుటీ ఎగవేసేందుకే సిద్ధమైన కంపెనీ నిర్వాహకులు గుట్టు చప్పుడు కాకుండానే ఫ్యాక్టరీని శాశ్వతంగా మూసి వేయడం గమని ందదగ్గ విషయం. అంటే ఆర్థికపర అంశాలను గాలికొదిలేసి యాజమాన్యం మాన్యం తన దారి తాను చూసుకుందన్న మాట. తొలిత చెల్లిస్తామని చెప్పి తోక జాడించారు..! మంచిర్యాల సిమెంట్ కంపెనీని ఎప్పుడైతే యాజమాన్యం మూసి వేయాలని నిర్ణయించిందో అప్పుడు కార్యెకులకు గ్రాట్యుటీ చెల్లింపుకు శాస్త సుముఖత వ్యక్తం చేసినట్లుగానే కనిపించింది.. అయినప్పటికీ తర్వాత మారిన పరిణామ క్రమంలో ఆ గ్రాట్యుటీ సైతం ఇవ్వసని మొండికేసింది. లక్షా యాభై వేల వరకు ఇస్తానని చెపి తోక జాడించిన నైజం ఈ ఎంసీసీ యాజమాన్యానిది. మొత్తానికి అటు గ్రాట్యుటీ లేక ఇటు ఎరియర్స్ రాక అంతిమంగా కార్మికులే నష్టపోయారని స్పష్టం కాక తప్పడం లేదు. అన్ని విధాల ఆర్థికంగా ప్రయోజనాలు పొందిన ఎంసీసీ యాజమాన్యం చివరికీ అందుబో పని చేసిన కార్మిక వర్గాన్ని బజారున పడేసింది. వారి బతుకులు బజారుపాలు చేసింది.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *