ప్రభుత్వలు మారిన మారని సింగరేణి కార్మికుల బ్రతుకులు

* ఇన్కమ్ టాక్స్ పేరుతో కార్మికుల నిలువు దోపిడి * ఏ ఐ ఎఫ్ టి యు రాష్ట్ర నాయకులు చంద్రగిరి శంకర్

పయనించే సూర్యుడు న్యూస్ జనవరి 12 మందమర్రి మండల ప్రతినిధి బొద్దుల భూమయ్య ప్రభుత్వలు మారిన సింగరేణి కార్మికుల బ్రతుకులు మారడం లేదని,ఇన్కమ్ టాక్స్ పేరుతో కార్మికులను నిలువు దోపిడి చేస్తున్నారని ఏఐఎఫ్టియు రాష్ట్ర నాయకులు చంద్రగిరి శంకర్ అన్నారు.ఈ సందర్భంగా చంద్రగిరి శంకర్ సింగరేణి కాలరీస్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ దేశానికి వెలుగులు పంచే సింగరేణి లో పనిచేస్తు నల్ల బంగారం వెలికి తీసి పని చేస్తున్న కార్మికుల జీవితాలను ఎన్ని ప్రభుత్వాలు మారినా కార్మికుల జీవితాల్లో మాత్రం వెలుగులు నింపడం లేదని అన్నారు ఇన్కమ్ టాక్స్ పేరుతో కార్మికులు సంవత్సర వేతనంలో నాలుగు నెలల వేతనం మొత్తం కూడా ఇన్కమ్ టాక్స్ రూపంలో కట్టడం జరుగుతుందని, సింగరేణి సంస్థ గత రెండు సంవత్సరాల నుండి సిఎంపిఎఫ్ చిట్టిలను కూడా ఇవ్వడం మానేసిందని దీనివల్ల కార్మికుల గరీష్ట వేతనం నుండి ఎంత మొత్తంలో ఇన్కమ్ టాక్స్ మిగతా టాక్స్ లకు చెల్లిస్తున్నామో తెలియడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. గత కెసిఆర్ ప్రభుత్వం అసెంబ్లీ లో ఇన్కమ్ టాక్స్ రద్దు పై బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించి కేంద్రానికి పంపించిన ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం దానిపై చర్యలు తీసుకోలేదని అన్నారు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్న చందం గా ఉన్నదని ఇకనైనా కేంద్ర బీజేపీ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వాలు స్పందించి ఇన్కమ్ టాక్స్ రద్దుకై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *