పయనించే సూర్యుడు జనవరి 12 మమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ -మన తెలుగువారు, గుంటూరు నివాసి డాక్టర్ ఆదినారాయణ న్యూఢిల్లీలో నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు గూర్చి ఎంత చెప్పినా తక్కువేమరి. ఆయన కేంద్ర ప్రభుత్వంలో ఉద్యోగం చేసి పదవీ విరమణ పొందారు. ఆయన తెలుగు తెలుగు రాష్ట్రాలతో పాటు గోవా, కర్నాటక, తమిళనాడు తదితర రాష్ట్రాలలో సైతం అనేక సేవా కార్యక్రమాలు ఏళ్ళ తరబడి నిర్వహిస్తున్నారు. న్యూఢిల్లీలో సైతం అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అనేక రంగాలలో ప్రతిభ కనబరచిన వారిని గుర్తించి, జాతీయ స్థాయి ఆదితలా ఫౌండేషన్ ద్వారా సత్కారాలు, సన్మానాలు, మెమోంటోలు బహుకరణ చేస్తూ, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు, కేంద్రమంత్రుల ప్రశంశలు అందుకున్న గొప్ప వ్యక్తి డాక్టర్ ఆదినారాయణ. కుల, మతాలకు అతీతంగా వారి ప్రతిభను ఆయన గుర్తించి ఆదితలా ఫౌండేషన్ ద్వారా అనేక సేవా సత్కారాలు నిర్వహించారు. డాక్టర్ ఆదినారాయణ తెలుగు భాషాభివృద్ధి, హిందూమత ఆచార సాంప్రదాయాలు అభ్యున్నతి కోసం నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు అనేకం ఉన్నాయి. ఆయన నిర్వహిస్తున్న సేవాకార్యక్రమాల నేపథ్యంలో పలు యూనివర్సిటీల నుంచి గౌరవ డాక్టరేట్తో పాటు అనేక పురస్కారాలు అందుకున్న వ్యక్తి. ఏళ్ళ తరబడి అవిశ్రాంతంగా న్యూఢిల్లీతో పాటు పలు రాష్ట్రాలలో సైతం జాతీయ స్థాయిలో అనేక రకాల గొప్పగొప్ప సేవాకార్యక్రమాలు నిర్వహిస్తూ అందరి ప్రశంశలు అందుకుటున్న డాక్టర్ ఆదినారాయణగారు మన తెలుగు వారు కావటం గర్వించతగ్గ విషయమని చెప్పక తప్పదు.