పయ నించే సూర్యుడు జనవరి 12 2026 ముమ్మిడివరం ప్రతినిధి కాట్రేనికోన, కాట్రేనికోన మండలంలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ముందుగా సంక్రాంతి సంబరాలు కార్యక్రమం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. కాట్రేనికోన హైస్కూల్, శ్రీవాణి హై స్కూల్, బెతాని హై స్కూల్, సుమేదా హై స్కూల్ తదితర పాఠశాలలో ఈ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులంతా సాంప్రదాయ దుస్తులు ధరించి, సంక్రాంతి ముగ్గులు వేసి, గొబ్బెమ్మలు పెట్టారు. భోగి మంటలు వెలిగించారు. గంగిరెద్దుల వేషాలు అలరించాయి. ఈ సందర్భంగా సాంప్రదాయ వంటకాలు, పిండి వంటలు ప్రదర్శించారు. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆయా పాఠశాలల, ప్రధానోపాధ్యాయులు, పేరెంట్స్ కమిటీ సభ్యులు, విద్యార్థులు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు