
సర్పంచ్ ను సన్మానించిన సంస్థాను ప్రతినిధులు. పయనించే సూర్యుడు న్యూస్ జనవరి 12 బోధన్ :జగద్గురు శ్రీమద్ రామానందా చార్య నరేంద్రాచార్యజీ దక్షిణపీఠ్ నాణీజ్ధామ్ మహారాష్ట్ర వారి ఆధ్వర్యంలో ఆదివారం జీవన దాన మహా కుంభ్ సంకల్పంతో నిజామాబాద్ జిల్లా జనరల్ ఆసుపత్రి వారి సహకారంతో సాలూర మండల కేంద్రంలోని టీటీడీ కల్యాణ మండపంలో రక్త దాన శిబిరాన్ని నిర్వహించారు.యువకులు,సంస్థాన్ ప్రతినిధులు భారీ సంఖ్యలో తరలివచ్చి రక్తాన్ని దానం చేశారు. రక్తం దానం చేసిన వారికి సర్టిఫికెట్ ఆఫ్ అప్లికేషన్ ను గవర్నమెంట్ బ్లడ్ బ్యాంక్ తరఫు నుంచి అందజేశారు.ఈ సందర్భంగా సాలూర మండల మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రాజ్ కుమార్ మాట్లాడుతూ మానవ జీవితంలో దానం యొక్క ప్రాముఖ్యత అనూహ్యమైనదన్నారు.రక్తం దానం చేయడం వలన ఒకరి ఆయుష్షు నిలుస్తుంది అని పేర్కొన్నారు.సంస్థాన్ వారు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సొక్కం లావణ్య రవి,ఉపసర్పంచ్ బుయ్యన్ సురేష్ పటేల్,కాంగ్రెస్ పార్టీ నాయకులు శంకర్,సంస్థాన్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.