పయనించే సూర్యడు టెక్కలి ప్రతినిధి జనవరి 13 టెక్కలి మండలం చిన్న నారాయణపురం గ్రామంలో ఇప్పిలి నాని అనే యువకుడు కుటుంబ పోషణకై విజయవాడ వెళ్లి కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునే వాడు.. ఇటీవల మూడో అంతస్తులో పనిచేస్తుండగా ప్రమాదవశాత్తు కాలుజారి పడిపోవడంతో ప్రక్కటెముకులకు బలమైన గాయాలయ్యాయి. వీళ్లది చాలా పేద కుటుంబం మందులు కొనుక్కోడానికి కూడా డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నారని సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న టెక్కలి అభయ యువజన సేవా సంఘం వాళ్లు స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఆ బీద కుటుంబం కి ఆదుకోవాలనే ఆలోచనతో సోమవారం మందుల ఖర్చు నిమిత్తం 10,000 రూపాయలు ఆర్థిక సాయం చేసినట్లు అభయం యువజన సేవా సంఘం అధ్యక్షులు దేవాది శ్రీనివాసరావు తెలియజేశారు. ఈ కార్యక్రమం లో అభయం యువజన సేవా సంఘం అధ్యక్షులు దేవాది శ్రీనివాస రావు, సంఘ సభ్యులు యన్ సింహాచలం, ధర్మవరపు పూర్ణాచారి,మున్నా, దాసరి మహేష్ పాల్గొన్నారు.