పయినించే సూర్యుడు ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల ప్రతి నీధి సమాజంలో ఉచిత సేవలు అందించడంలో కంచికచర్ల లయన్స్ క్లబ్ ముందుంటుందని లయన్ డిస్టిక్ అంబాసిడర్, డాక్టర్ పుల్లగూర ప్రభాకర్ రావు పేర్కొన్నారు. లయన్ ఇంటర్నేషనల్ క్లబ్ వ్యవస్థాపకులు లయన్స్ మెల్విన్ జోన్స్ పుట్టినరోజు సందర్భంగా జిల్లా గవర్నర్ వి వి సి ఆంజనేయులు ఆదేశాల మేరకు లయన్స్ హంగర్ విక్ లో భాగంగా కంచికచర్ల నెహ్రూ సెంటుర్ నందు 100 మంది పేద ప్రజలకు మంగళవారంబిర్యానీ ప్యాకెట్లను పంపిణీ చేయడం జరిగినది. ఈ సందర్భంగా లయన్స్ డిస్టిక్ అంబాసిడర్ డాక్టర్ పుల్లగూరప్రభాకర్ రావు మాట్లాడుతూ కంచికచర్ల లయన్స్ క్లబ్బు ద్వారా బడుగు బలహీన వర్గాల పేద ప్రజానీకానికి ప్రధానంగా విద్య, వైద్య, ఉచిత సేవా కార్యక్రమాలు అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో విజయవాడ పార్లమెంట్ కమిటీ ఉపాధ్యక్షులు కాపు సంఘ నాయకులు వేమా వెంకట్రావు, లయన్ క్లబ్ అధ్యక్షులు ఎం ఎస్ ఆర్ వి ప్రసాద్, లయన్స్ క్లబ్ సభ్యులు నంబూరు పెదబాబు, పెద్దినీడి కోటేశ్వరరావు, తాడే కోరు వెంకటప్పయ్య, కాపు సంఘ నాయకులు నంబూరి నాగేశ్వరరావు, దాసరి రాము, గంజి దుర్గారావు, పొన్నపల్లి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.