పయనించే సూర్యుడు జనవరి 13 నేరెడుచెర్ల మండల ప్రతినిధి (చింతల శ్రవణ్) నేరేడుచర్ల పట్టణం లో స్వామి వివేకానంద జయంతి ఘనంగా నిర్వహించారు జయంతి కార్యక్రమం ముఖ్య అతిథిగా విచ్చేసి నేరేడుచర్ల ఎస్.ఐ రవిందర్ నాయక్ చిత్రపటానికి పూలమాల వేసి ప్రారంభిచారు ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా స్వామి వివేకానందని ఆదర్శంగా తీసుకొని వారి ఆశయాలను ముందుకు తీసుకువెళ్తూ, సమాజంలో అట్టడుగు వర్గాలకు చేయూత అందించాలని, యువత వారి ఎదుగుదలకు అడ్డుపడే విషయాలకు. ముఖ్యంగా మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు . కమిటీ సభ్యులు మాట్లాడుతూ వచ్చే సంవత్సరం వివేకానంద జయంతి కార్యక్రమంను ప్రత్యేక స్థలం, విగ్రహం ఏర్పాటు చేసుకొని అక్కడే చేసుకోవాలని, ఇందుకు రాజకీయాలకు అతీతంగా మద్దతిస్తామని అందరూ తెలియజేయగా, విగ్రహానికి అయ్యే ఖర్చును చెల్లిస్తానని సరికొప్పుల నాగేశ్వరరావు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కొణతం సీతారాం రెడ్డి ధూళిపాళ ధనుంజయ నాయుడు, రాపోలు నవీన్, శంకర్ రెడ్డి, షేక్ మధార్, సంకలమద్ది సత్యనారాయణ రెడ్డి, జూలూరి అశోక్, కొణతం నాగి రెడ్డి, చిలకరాజు శ్రీను, కాలం సైదులు, కాల్వ సైదులు, పున్నయ్య,పల్లెపంగు నాగరాజు, కెమరామెన్ అర్ కే హుస్సేన్, ఉరిమిళ్ళ రాధాకృష్ణ నరెంధర్ రెడ్డి, నరి నాయక్, విద్యార్థినీ విద్యార్థులు, ప్రజలు పాల్గొన్నారు