పయనించే సూర్యుడు జనవరి 13 కర్నూలు జిల్లా ఇంచార్జ్ శ్రీకాంత్ కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో ఆదోని జిల్లాగా ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో 58వ రోజు రిలే నిరాహార దీక్ష కొనసాగింది. ఆదోని నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ పి.వి. పార్థసారథి ఆదేశాల మేరకు ఆదోని జిల్లా సాధన కమిటీకి మద్దతుగా బీజేపీ నాయకులు ఈ నిరాహార దీక్షలో పాల్గొన్నారు. ఆదోని జిల్లా కోసం పోరాటం చేస్తున్న వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ, జిల్లా సాధించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని నేతలు స్పష్టం చేశారు. ఆదోని, ఆలూరు, పత్తికొండ, మంత్రాలయం నియోజకవర్గాల నుంచి ప్రజలు భారీగా వలస వెళ్లాల్సి వస్తోందని, జిల్లా ఏర్పాటు అయితే ఈ వలసలు ఆగుతాయని వారు తెలిపారు.రెండో ముంబైగా పేరుగాంచిన ఆదోని జిల్లా కాకపోవడం వల్లే అభివృద్ధిలో వెనుకబడి పోయిందని అన్నారు. అత్యవసర వైద్యం, విద్య, పరిపాలనా అవసరాల కోసం ప్రజలు కర్నూలుకు సుమారు 100 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదోని జిల్లా అయితే విద్య, వైద్యం, నీరు, రైతుల సమస్యలు పరిష్కారమవుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పెద్ద తుంబలం మండల అధ్యక్షులు కురవ వేణుగోపాల పెద్ద తుంబలం కార్యవర్గ కమిటీ సభ్యులు బిజెపి నాయకులు. కే శంకరయ్య అధ్యక్షులు కే శ్రీనివాసులు దాసప్ప ఆనందాచారి. గోల నాగభూషణం. బోయ లింగన్న. హుసేని. తదితరులు పాల్గొన్నారు.