పయనించే సూర్యుడు జనవరి 13 ఆదోని నియోజకవర్గం ప్రతినిధి బాలకృష్ణ ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ముగ్గులు మన తెలుగు సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలని, మహిళల కళా ప్రతిభను వెలుగులోకి తీసుకువచ్చే వేదికలుగా ఇటువంటి కార్యక్రమాలు నిలుస్తాయన్నారు. పండుగల సమయంలో గ్రామాలు, పట్టణాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా సమాజంలో ఐక్యత, ఆనందం పెరుగుతుందన్నారు. పోటీల్లో పాల్గొన్న మహిళలను అభినందించిన ఆమె, విజేతలకు బహుమతులు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. మహిళల ఆత్మవిశ్వాసం, సృజనాత్మకతను ప్రోత్సహించే కార్యక్రమాలకు తాను ఎల్లప్పుడూ మద్దతుగా ఉంటానని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, మారుతిరావు గోపాలు ఎక్స్ కౌన్సిలర్ ఈరన్న గోవిందు సకల స్వామి సంగం మహిళలు నాయకులు, తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ శ్రీమతి పార్వతి వెంకటేష్ ఎక్స్ ఎంపీపీ మురళి, ఎక్స్ సర్పంచ్ మాధవ్ కల్లుబావి, మల్లికార్జున, బాబురావు భాస్కర్ ఓంకార్ ఖాసిం అశోక్ రాయలసీమ రవి దేవేంద్ర మల్లయ్య ఎల్లప్ప లక్ష్మన్న శేఖర్ అబ్దుల్ భరత్ వీరేష్ రాఘవరెడ్డి, పార్టీ నాయకులు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
