పయనించే సూర్యుడు జనవరి 13 హుజురాబాద్ రూరల్ రిపోర్టర్ బండ శివానంద రెడ్డి హుజూరాబాద్ పట్టణంలో ఏబీవీపీ రాష్ట్ర కో కన్వీనర్ గోస్కుల అజయ్ ఆధ్వర్యంలో సోమవారం రోజున స్వామి వివేకానంద 163వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఏబీవీపీ నాయకులు స్వామి వివేకానంద విగ్రహనికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. రాష్ట్ర కో కన్వీనర్ అజయ్ మాట్లాడుతూ.. యువత స్వామి వివేకానందున్ని ఆదర్శంగా తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు పాల్గొన్నారు.