పయనించే సూర్యుడు తేదీ: మంగళవారం జనవరి 13, 2026 గాజులరామారం రిపోర్టర్ ఆడెపు సంతోష్ కుమార్ (మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా) జీడిమెట్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన 8వ తరగతి విద్యార్థి అజయ్ కుమార్ జాతీయస్థాయి కోఖో పోటీలకు ఎంపికయ్యారు. రాష్ట్రం తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నారు. (ఎస్ జి ఎఫ్ ) పాఠశాల ఆటల సమాఖ్య 14 సంవత్సరాల లోపు విభాగం లో రాష్ట్రస్థాయి పోటీలు గత నెల 30 వరకు రంగారెడ్డి జిల్లా తాండూరులో జరిగాయి. అజయ్ కుమార్ రంగారెడ్డి జిల్లా జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించి ప్రథమ స్థానంలో నిలిచి.. జాతీయస్థాయి పోటీకి ఎంపిక అయ్యాడు. రాజస్థాన్ లో ఈనెల 16 నుంచి జరిగే జాతీయస్థాయి పోటీల్లో పాల్గొననున్నట్లు పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు జి.ఆర్. నవ్యజ్యోతి తెలిపారు. జాతీయ స్థాయి పోటీల్లో కూడా విజయం సాధించాలని పాఠశాల ఉపాధ్యాయ బృందం మరియు ప్రధానోపాధ్యాయులు ఆశించారు.