
పయనించేసూర్యుడు న్యూస్ 13 జనవరి పుల్కల్ మండలప్రతినిధిపెద్దగొల్లవిజయ్ కుమార్. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండల పరిదిలోని ముదిమాణిక్యం గ్రామమంలొ యువజన స్ఫూర్తి ప్రదాత యువతకు ఆదర్శప్రాయుడు స్వామి వివేకానంద 163వ జయంతి వేడుకలను ముదిమాణిక్యం గ్రామంలో గ్రామ సర్పంచ్ పడమటి రమేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ యువతను జాగృతం చేసిన స్వామీ వివేకానంద ఆలోచనలు, ఆదర్శాలు నేటికీ దేశ యువతకు మార్గదర్శకంగా నిలుస్తున్నాయి. వారు చూపిన విలువల బాటలో నడుచుకుంటూ, దేశ నిర్మాణంలో యువశక్తి కీలక పాత్ర పోషిస్తూ, మరింత బలంగా ముందుకు సాగాలి అని పేర్కొన్నారు. అలాగే ఈ కార్యక్రమం లో పాల్గొన్న పుర దుర్గయ్య, ఇందూరి మోహన్ మాట్లాడుతూ మా స్వామి వివేకానంద విగ్రహని ఇద్దరు కలసి సమిష్టిగా ఇప్పిస్తాం అని మాట ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ వార్డ్ సభ్యులు మరియు గ్రామ పెద్దలు, యువజన సంఘాల నాయకులు యువకులు తదితరులు పాల్గొన్నారు.