వస్తాపూర్‌లో ఇందిరమ్మ చీరల పంపిణీ

పయనించే సూర్యుడు న్యూస్ రాయికల్ మండల్ జనవరి 13 మామిడిపెల్లి లక్ష్మణ్ రాయికల్ మండలం వస్తాపూర్ గ్రామంలో సోమవారము సర్పంచ్ గుగ్లావత్ తిరుపతి వస్తాపూర్ ఆధ్వర్యంలో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామంలోని అర్హులైన మహిళలకు చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ తిరుపతి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం పేద మహిళల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ చీరల పథకం ఎంతో ఉపయోగకరమని తెలిపారు. ప్రతి అర్హ మహిళకు ప్రభుత్వ పథకాల ఫలాలు అందేలా కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం నరహరి, గ్రామ కార్యదర్శి విజయ్, ఉపసర్పంచ్, సీసీ సుజాత, వార్డు సభ్యులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *