పయనించే సూర్యుడు న్యూస్ పెద్దపల్లి: జనవరి 13:- మంథని పురపాలక సంఘం పరిధిలో గౌతమి తాపీ సంఘం భవన నిర్మాణానికి ఐటి పరిశ్రమల&అసెంబ్లీ వ్యవహారాల మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు సోమవారం శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడుతూ తాపీ మేస్త్రీల సంక్షేమం కోసం 20 లక్షలతో కమ్యూనిటీ హాల్ భవనం నిర్మించడం జరుగుతుందని ఇది వారి సమావేశ మందిరం కు వారి పిల్లల పెళ్లి కార్యక్రమాల కోసం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. భవన నిర్మాణ కార్మికుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పెడుతూ కార్మికులకు లబ్ధి చేకూరే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందన్నారు. అనంతరం ఆ సంఘం నూతన సంవత్సర క్యాలెండర్లను ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సమైక్య సంఘం జిల్లా అధ్యక్షులు చిలువేరు స్వామి, గౌతమి తాపీ సంఘ అధ్యక్షులు బొద్దుల రామ్ నారాయణ, మంథని మండల అధ్యక్షులు శంకర్, జిల్లా ఉపాధ్యక్షులు తిరునాహరి రాజు, బైరి శంకర్, ఎస్కే షరీఫ్, చిప్పబాబు, గడ్డం శంకర్, ఇటిక్యాల సుధాకర్, కనుకుంట్ల బాబు, సుదర్శన్,రమేష్, రాజేశం, దామోదర్, పాల్గొన్నారు.