పయనించే సూర్యుడు మేజర్ న్యూస్ జనవర13.01.2026 మదనపల్లె అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండల ప్రతినిధి జె. నాగరాజ) భూముల రీసర్వే లో నిర్లక్ష్యం వహించరాదని తహసిల్దార్ పార్వతి హెచ్చరించారు సోమవారం స్థానిక పరిపాలన భవనంలోని తహసిల్దార్ కార్యాలయంలో మండలంలోని విఆర్వోలు సర్వేయర్లతో రీ సర్వే పై సమీక్ష సమావేశం నిర్వహించారు గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు రీ సర్వే అవగాహన కల్పించాలన్నారు రికార్డు పరంగా సర్వే చేయించాలన్నారు ప్రభుత్వ నిర్దేశిత సమయంలోపు రీసర్వ్ చేసి రికార్డులను ఉన్నతాధికారులకు సమర్పించాలన్నారు అనంతరం పంచాయతీల వారీగా రీ సర్వేపైచర్చించారు ఈ కార్యక్రమంలో మండలంలోని విఆర్వోలు సర్వేయర్లు పాల్గొన్నారు