పయనించే సూర్యుడు జనవరి 13 నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి రిపోర్టర్ కే. శ్రవణ్ కుమార్ మాజీ సీఎల్పీ నాయకులు, కీర్తిశేషులు శ్రీ పి. జనార్దన్ రెడ్డి 78వ జయంతిని పురస్కరించుకొని సోమవారం (12-01-2026) హైదరాబాద్ ఖైరతాబాద్ చౌరస్తాలోని పీజేఆర్ విగ్రహానికి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమాన్ని లంబాడి ఐక్య వేదిక ఆధ్వర్యంలో నిర్వహించారు. మధ్యాహ్నం 12 గంటలకు పీజేఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఖైరతాబాద్ నియోజకవర్గ కంటెస్టెడ్ ఎమ్మెల్యే, ఖైరతాబాద్ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి పి. విజయ రెడ్డి, లంబాడి ఐక్య వేదిక లైవ్ నాగర్ కర్నూల్ అసెంబ్లీ ఇంచార్జ్ వి. శ్రీనివాస్ నాయక్ పాల్గొన్నారు. అలాగే రాజన్న, యాదన్న, నాగన్న, మొగ్లేసన్న, నరేష్, గోపాల్, శీనన్న, ఆనంద్, విష్ణు, మహేష్, రామాంజనేయులు తదితరులు పెద్ద సంఖ్యలో హాజరై పీజేఆర్ కి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ పీజేఆర్ ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేసిన గొప్ప నాయకుడని, ఆయన సేవలు తరతరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని కొనియాడారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.