పయనించే సూర్యుడు జనవరి 13 ఎన్ రజినీకాంత్:- భీమదేవరపల్లి మండలం కొత్తకొండ వీరభద్ర స్వామి సన్నిధానంలో జోష్విక నాట్య కళాక్షేత్రం జమ్మికుంటకు చెందిన చిన్నారులు కళా ప్రదర్శన నిర్వహించారు. వీరభద్ర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం ఆలయంలో జోష్విక నాట్య కళాక్షేత్రం గురువు బాదెల స్వప్నలత ఆధ్వర్యంలో సుమారు గంటపాటు చిన్నారులు చేసిన కూచిపూడి నృత్యాలు భక్తుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. భక్తి గేయాల పాటలకి చేసిన నృత్యాలు భక్తులకి కనువిందు చేశాయి. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ బొజ్జపురి అశోక్ ముఖర్జీ, ఈవో కిషన్ రావు, లతోపాటు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.