పయనించే సూర్యుడు జనవరి 13 కరీంనగర్ న్యూస్: కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జిగా నియమితులైన వెలిచాల రాజేందర్ రావు సోమవారం సాయంత్రం మంథనిలో ఐటీ పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబును మర్యాద పూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా శ్రీధర్ బాబును శాలువాతో సన్మానించారు మంత్రి ఆశీస్సులు అందుకున్నారు మంత్రి శ్రీధర్ బాబు రాజేందర్ రావుకు శుభాకాంక్షలు అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ కరీంనగర్ నగర పాలక సంస్థ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసి తీరాలని అందుకు అహర్నిశలు పాటుపడాలని రాజేందర్ రావుకు సూచించారు కరీంనగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలని పేర్కొన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రి రాజేందర్ రావు కు సూచించారు బిఆర్ఎస్ బిజెపి కుట్రలను ఎప్పటికప్పుడు తిప్పి కొట్టాలని సలహా ఇచ్చారు