ఏకేవీఆర్ కళాశాలలో ఘనంగా ముందస్తు సంక్రాంతి వేడుకలు

పయనించే సూర్యుడు జనవరి 13 ఎన్ రజినీకాంత్:- హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ఏకేవీఆర్ జూనియర్, డిగ్రీ కళాశాలలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని కళాశాల ప్రాంగణంలో “ముందస్తు సంక్రాంతి సంబరాలు” అత్యంత వైభవంగా నిర్వహించారు. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా విద్యార్థినీ విద్యార్థులు, అధ్యాపకులు ఈ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా విద్యార్థినులు వేసిన రంగురంగుల ముగ్గులు పండుగ వాతావరణాన్ని తీసుకువచ్చాయి.
సాంప్రదాయ దుస్తుల్లో విద్యార్థులతో కళాశాల ప్రాంగణం అంతా కోలాహలంగా మారింది. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ సంక్రాతి పండుగ సంస్కృతిని సంప్రదాయాలకు ప్రతీక అని వాటిని గౌరవించాలని కోరారు.పండుగ విశిష్టతను విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల సీనియర్ అధ్యాపకులు రాంబాబు, హరికృష్ణ, ఓదెలు, జ్యోతి, సుమన్, ఐలయ్య, శ్రీనివాస్, భారతి, రాధిక, రజని మరియు ఇతర సిబ్బంది, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *