
పయనించే సూర్యుడు జనవరి 14 ఎన్ రజినీకాంత్ :- కొత్తకొండ వీరభద్రస్వామి ఆలయ అభివ్రుద్ధికి అన్ని విధాలా క్రుషి చేస్తానని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ హామీ ఇచ్చారు.. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని కొత్తకొండ శ్రీ వీరభద్రస్వామిని కరీంనగర్ ఎంపీ, కేంద్ర హోం సహాయక మంత్రి బండి సంజయ్ కుమార్ మంగళవారం దర్శించుకున్నారు.. ఈ సందర్భంగా కేంద్రమంత్రికి ఆలయ ఈవో కిషన్ రావు, దేవాలయ చైర్మన్ అశోక్ ముఖర్జీ, ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికారు.. అనంతరం వీరభద్రస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ, ప్రక్రుతితో ముడిపడిన ఈ పండుగను తెలుగు ప్రజలందరూ సంతోషంగా, సంబురంగా జరుపుకోవాలని, విదేశీ సంస్క్రుతికి అలవాటుపడి మన సంస్కృతిని మర్చిపోతున్న ఈ తరుణంలో ముగ్గుల పోటీలు, సంక్రాంతి పోటీలు నిర్వహిస్తూ తెలుగు సంస్కృతి సాంప్రదాయాలను గుర్తు చేయడం చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నారు.. కొత్తకొండ వీరభద్రస్వామి స్వామి బ్రహ్మోత్సవాలకు ప్రతి ఏటా దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుందని, కోరిన కోర్కెలు తీర్చే కోరమీసాల స్వామి వీరభద్రుడుని దర్శించుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు.. కోర మీసాల స్వామి కాబట్టి సమాజాన్ని నాశనం చేయాలనుకునేవాళ్లకు, చెడు ఆలోచనలు ఉన్న వాళ్లలో మార్పు తీసుకొచ్చే స్వామి వీరభద్రస్వామి.. ఈ జిల్లా, రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉండాలని, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని , ఈ తరుణంలో ప్రతి ఒక్కరూ మోదీకి అండగా నిలవాలని తెలిపారు.. ఉభయ తెలుగు రాష్ట్రాలతోపాటు మహారాష్ట్ర, పొరుగు రాష్ట్రాల నుంచి భక్తులు వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలకు వస్తుంటారని, ఆలయ అభివ్రుద్ధికి సహకరిస్తూ, భవిష్యత్తులో దేవాలయ అభివ్రుద్ధికి నా వంతు క్రుషి చేస్తా అని హామీఇచ్చారు.. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో కిషన్ రావు, దేవాలయ చైర్మన్ అశోక్ ముఖర్జీ, భీమదేవరపల్లి సర్పంచ్ మాచర్ల కుమారస్వామి, జిల్లా కౌన్సిలర్ పైడిపల్లి పృథ్వీరాజ్ గౌడ్, సీనియర్ నాయకులు దొంగల కొమురయ్య, బిజెపి నాయకులు తదితరులు పెద్ద సంఖ్యలు పాల్గొన్నారు..
