గొల్లపల్లిలో వన్ మంత్ వన్ విలేజ్ ఫోర్ విజిట్ కార్యక్రమం

పయనించే సూర్యుడు జనవరి 14 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) వన్ మంత్ – వన్ విలేజ్ – ఫోర్ విజిట్స్ కార్యక్రమంలో భాగంగా రెండవ చేజర్ల మండలం గొల్లపల్లి గ్రామపంచాయతీ ప్రాథమిక పాఠశాలలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చేజర్ల తహశీల్దారు, ఆర్ మస్తానయ్య ఆదేశముల మేరకు మండల రెవెన్యూ ఇన్ స్పెక్టరు, గ్రామ రెవెన్యూ అధికారి గ్రామ సర్వేయరు గ్రామాన్ని సందర్శించి ప్రజల సమస్యలను నేరుగా వినిపించుకున్నారు. ఈ సందర్భంగా వాళ్ళు మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న సమస్యలను వేగంగా పరిష్కరించడం ద్వారా ప్రజలకు తక్షణ ఉపశమనం కలిగించడమే ఈ కార్యక్రమం ముఖ్య లక్ష్యమని పేర్కొన్నారు. రెవెన్యూ శాఖ ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటుందని, గ్రామస్థులు తమ సమస్యలను భయపడకుండా నేరుగా అధికారులకు తెలియజేయవచ్చని హామీ ఇచ్చారు. ప్రజల సమస్యలకు శాశ్వత పరిష్కారం అందించే దిశగా ప్రభుత్వం కట్టుబడి ఉందని వన్ మంత్ – వన్ విలేజ్ – ఫోర్ విజిట్స్ వంటి కార్యక్రమాలు ప్రజలకు మరింత చేరువయ్యేలా రూపొందించబడ్డాయని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా రెవెన్యూ శాఖ పనితీరుపై ప్రజల్లో విశ్వాసం పెరుగుతోందని, భవిష్యత్తులో కూడా ఇలాంటి ప్రజోపయోగ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు ఉడత హజరతయ్య. రెవిన్యూ సిబ్బంది గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *