పయనించే సూర్యుడు జనవరి 14 ఆదోని నియోజకవర్గం క్రైమ్ రిపోర్టర్ కృష్ణ. ఆదోని మున్సిపాలిటీకి అత్యంత ప్రాముఖ్యత కలిగిన వార్షిక బడ్జెట్ సమావేశానికి వైఎస్సార్ పార్టీ కౌన్సిలర్లు హాజరు కాకపోవడం సిగ్గుచేటని బిజెపి కౌన్సిలర్లు వెల్లాల లలితమ్మ, చిన్న ,ఎవి సురేష్, పద్మావతి విమర్శించారు.ఈ సందర్భంగా లలితమ్మ మాట్లాడుతూ ఆదోని అభివృద్ధి కోసం ప్రణాలిక బద్ధమైన బడ్జెట్ సమావేశాలకు వైఎస్సార్ పార్టీ వైస్ చైర్మన్, కౌన్సిలర్లు హాజరు కాకపోవడం చాలా విచారకరమని లలితమ్మ విమర్శించారు.వైఎస్సార్ పార్టీకి ఆదోని అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి లేదని, కేవలం మున్సిపాలిటీని దోచుకోవడానికి మాత్రమే వైసిపి పనిచేస్తోందని లలితమ్మ అన్నారు.ఒక సంవత్సర కాలమునుండి పరిశీలిస్తే మాజీ చైర్మన్ బోయ శాంతమ్మ వైఎస్సార్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తోంది కాబట్టి శాంతమ్మను మార్చిన తర్వాత ఆదోనిని అభివృద్ధి పథములో పరుగులు పెట్టిస్తామని ప్రజలకు మాయమాటలు చెప్పి ఏడు నెలలు కాలం వెళ్ళదీసారని, మూడు నెలల క్రితం తలా లక్షన్నర రూపాయలు తీసుకుని కొత్త చైర్మన్ వైసిపి కౌన్సిలర్లే కొత్త చైర్మన్ ను ఎన్నుకున్నారని, కొత్త చైర్మన్ వచ్చినప్పటి నుండి శానిటేషన్ ఉద్యోగాల అమ్మకాల దగ్గర, కాంట్రాక్టు పనుల దగ్గర, మునిసిపాలిటీ ద్వారా జరిగే వివిధ అభివృద్ధి పనులు దగ్గర చైర్మన్ కు, వైస్ చైర్మన్ కు, కౌన్సిలర్లకు వాటాల పంపకాలలో తేడాలు వచ్చి ఆదోని అభివృద్ధిని గాలికి వదిలేశారని లలితమ్మ ఎద్దేవా చేశారు.ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పివి పార్థసారథి మాట్లాడుతూ ఆదోని అభివృద్ధి కోసం మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు సహకరించండి ఆదోని మున్సిపాలిటీని అభివృద్ధి చేసుకుందామని ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా కూడా, మాకు ఆదోని మున్సిపాలిటీ ద్వారా ఆదాయమే ముఖ్యం కానీ, ఆదోని అభివృద్ధి మాకు సంబంధం లేదనే విధంగా వైఎస్సార్ పార్టీ కౌన్సిలర్లు ప్రవర్తించడం చాలా విచారకరమని లలితమ్మ దుయ్యబట్టారు.ఆదోని ప్రజలు అన్ని గమనిస్తూనే ఉన్నారని తప్పకుండా రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్సార్ పార్టీకి తగిన గుణపాఠం చెబుతారని లలితమ్మ అన్నారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు చిన్న,ఎవి సురేష్, పద్మావతమ్మ పాల్గొన్నారు.