భారత కమ్యూనిస్టు పార్టీ శతాబ్ది

* ఉత్సవాల బహిరంగ సభను జయప్రదం చేయాలి * ఆదోనిలో సీపీఐ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ

పయనించే సూర్యుడు జనవరి 14 కర్నూలు జిల్లా ఇన్చార్జ్ శ్రీకాంత్ భారత కమ్యూనిస్టు పార్టీ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా జనవరి 18న ఖమ్మం నగరంలో నిర్వహించనున్న గొప్ప బహిరంగ సభను, అలాగే జనవరి 16న ఆదోనిలో జరుగు పబ్లిక్ మీటింగ్ ను జయప్రదం చేయాలని పిలుపునిస్తూ సిపిఐ మండల కార్యదర్శి కల్లుబావిరాజు, పట్టణ సహాయ కార్యదర్శి యు లక్ష్మీనారాయణ ఏఐవైఎఫ్ పట్టణ కార్యదర్శి అంజిత్ గౌడ్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు.ఈ బైక్ ర్యాలీని సీపీఐ సీనియర్ నాయకులు కే అజయ్ బాబు రైతు సంఘం నాయకులు బాసాపురం గోపాల్ జెండా ఊపి ప్రారంభించారు. ర్యాలీ బుడ్డేకల్ లోని భారత కమ్యూనిస్టు పార్టీ కార్యాలయం నుండి ప్రారంభమై గుల్షన్ షా దర్గా, హవన్నపేట, తిక్క స్వామి దర్గా, పోలీస్ కంట్రోల్ రూమ్, భీమాస్ సర్కిల్, శ్రీనివాస భవన్, ఏరియా హాస్పిటల్ రోడ్డు గుండా సాగి తిరిగి సీపీఐ కార్యాలయం వద్ద ముగిసింది. ఈ సందర్భంగా సీపీఐ సీనియర్ నాయకులు అజయ్ బాబు మాట్లాడుతూ, వందేళ్ల చరిత్ర కలిగిన భారత కమ్యూనిస్టు పార్టీ దేశంలోని కార్మికులు, రైతులు, పేదలు, అణగారిన వర్గాల హక్కుల కోసం నిరంతరం పోరాడుతూ వచ్చిందన్నారు. శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఖమ్మంలో జరగనున్న బహిరంగ సభకు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.ఈ ర్యాలీలో సీపీఐ డిహెచ్పిఎస్ జిల్లా ఏ విజయ్ కుమారస్వామి నాగరాజు రవి వడ్డే రాము పులి రాజు గిడ్డయ్య వంశీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *