పయనించే సూర్యుడు , 14 జనవరి 2026, భీంగల్ మండల ప్రతినిధి కొత్వాల్ లింబాద్రి, నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం భీంగల్ పట్టణంలో మంగళవారం రోజున యోగా గ్రూప్ ఆధ్వర్యంలో శ్రీ సరస్వతి శిశు మందిర్ విద్యాలయం నందు సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో భీంగల్ పట్టణంలోని పలు వాడల నుండి అధిక సంఖ్యలో మహిళలు మరియు చిన్నారులు పాల్గొని అద్భుతమైన రంగవల్లి ముగ్గులతో ప్రజలను ఆకర్షింప చేశారు . ముఖ్య అతిథిగా డాక్టర్ బసంత్ రెడ్డి పోటీల్లో పాల్గొన్న వారికి బహుమతులు అందజేశారు. మొదటి బహుమతి కట్ట లాస్య, చిన్నారి పోటీలలో ప్రథమ బహుమతి జవ్వాజి ప్రజ్ఞ రుద్రాణి దక్కించుకున్నారు. పోటీలలో పాల్గొన్న వారందరికీ యోగ గ్రూప్ వారు బహుమతులు అందజేశారు. ఇట్టి కార్యక్రమంలో యోగ గురూజీ పర్స అనంతరావు, గట్టిగారి నరసయ్య, బద్రి జలజ, జేజే నర్సయ్య,యెన్ను శ్రీధర్, జవ్వాజి శ్రీనివాస్, మంచ గణేష్, పల్లికొండ శ్రీనివాస్, ఉప్పల నవీన్, పల్లికొండ శివ, రవి, తోపారం సురేందర్, మరియు యోగ గ్రూప్ సభ్యులు పాల్గొన్నారు.