
పయనించే సూర్యుడు పెనుగంచిప్రోలు మండలం రిపోర్టర్ ఆరుద్ర రమేష్ ఎన్టీఆర్ జీల్లా జగయ్యపేట నియోజకవర్గం జనవరి 14 పెనుగంచిప్రోలు లోని శ్రీ శ్రీ శ్రీ రుక్మిణీ సత్యభామా సమేత శ్రీ వేణుగోపాలస్వామి వారి ఆలయంలో ధనుర్మాసం సందర్భంగా శ్రీ గోదా కృష్ణుల కల్యాణం శ్రీ పరాంకుశం బాలకృష్ణమాచార్యుల ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. శ్రీ కొమరగిరి రామచంద్ర మూర్తి దంపతులు, గజ్జి కృష్ణమూర్తి దంపతులు పీటల మీద కూర్చుని కళ్యాణాన్ని జరిపించారు. అనంతరం స్వామివారి దేవాలయంలో మహిళలతో ముగ్గులు వేయించి అంగరంగ వైభవంగా కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో కొమరగిరి రఘురామారావు, ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు కాకాని శ్రీనివాసరావు, రేగండ్ల రవికుమార్ మరియు నలమోలు శివరామ ప్రసాద్, భక్తులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
